calender_icon.png 29 November, 2024 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

28-11-2024 11:05:21 PM

పాఠశాలలో అవసరమైన మరమ్మతులు వెంటనే చెప్పటాలని ఆదేశం

ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి 

సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి

పటాన్ చెరు,(విజయక్రాంతి): పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బీసీ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో కిచెన్ షెడ్డు, డైనింగ్ హాలు, స్టోర్ రూమ్, మూత్రశాలలు, మరుగుదొడ్లను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల కిటికీలు, డోర్ లకు అవసరమైన మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని ప్రిన్సిపల్ కు సూచించారు.

భవనం యజమానితో మాట్లాడి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని కస్తూరిబా పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తాసిల్దారులు, ఎంఈవోలు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చూడడంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగు కోసం చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.

భవనాల మరమత్తు పనులను ఆయా  యజమానులతో అధికారులు మాట్లాడి వెంటనే చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు మేను ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చూడాలని, కాలం చెల్లిన వస్తువులు వాడకూడదని సూచించారు. వసతి గృహాలకు, గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే బియ్యం నాణ్యతతో ఉండాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసీఓ కిరణ్ కుమార్, తహసిల్దార్  రాంబాబు, వసతి గృహ అధికారులు,   సిబ్బంది పాల్గొన్నారు.