11-04-2025 01:18:40 AM
యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 10 (విజయక్రాంతి): జిల్లాలో పోషణ పక్షంలో భాగంగా జిల్లా కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్ హనుమంత రావు రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డితో కలిసి పోషణ పక్షం పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోషణ పక్షం ఏప్రిల్ 8వ తేదీ నుండి ఏప్రిల్ 22వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.
కావున షెడ్యూలు ప్రకారం రోజు వారి కార్యక్రమాలు ప్రతి అంగన్వాడి కేంద్రంలో నిర్వహించాలని , కార్యక్రమాల ఫొటోస్ డాష్ బోర్డు లో అప్లోడ్ చేయాలని , యాదాద్రి భువనగిరి జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిలా సంక్షేమ అధికారి నరసింహ రావు , జిల్లా వైద్య శాఖ అధికారి మనోహర్ ,డిపిఓ సునంద బీసీ మరియు మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ యాదయ్య , డిపిఆర్‌ఓ అరుంధతి మరియు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులు మరియు పోషణ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.