calender_icon.png 5 February, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్ట్ డైరీని ఆవిష్కరించిన కలెక్టర్

30-01-2025 12:00:00 AM

సంగారెడ్డి, జనవరి 29 (విజయ క్రాంతి) : ప్రజాస్వామ్యంలో మీడియా రంగం అత్యంత ప్రాధాన్యత కలిగ ఉందని,  ప్రజాస్వామ్యానికి మూలస్తంభం మీడియా అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో  సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ 2025 డైరీని కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆవిష్కరించారు.  ప్రజలకు, పాలకులకు వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారం అందించడం గొప్ప విషయం అన్నారు.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సలహాదారుడు సునీల్, గౌరవ అధ్యక్షులు శంకర్రావు, ఉపాధ్యక్షులు ఎర్ర వీరేందర్ గౌడ్, రాజ్ కిషోర్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, కోశాధికారి నాగభూషణం, అసోసియేషన్ సభ్యులు, పుండరీకం, లక్ష్మణ్, నర్సింలు, సంగమేశ్వర్, రాజేష్, బక్కప్ప, ప్రవీణ్, అంజిరెడ్డి, సకినాల కృష్ణ పాల్గొన్నారు.