సూర్యాపేట,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కస్తూరి బజార్లో గల ఎస్సీ బీ బాలుర హాస్టల్ను గురువారం రాత్రి జిల్లా కలెక్టర తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన పిల్లలతో మాట్లాడి మెనూ ప్రకారం ఆహారం అందజేస్తున్నారా అని ఆరా తీశారు. తదుపరి వంటశాలను పరిశీలించి అక్కడే తయారీ చేయబడిన అన్నం, కూరలను పరిశీలించారు. అందుకు సంబందించిన వివరాలను వంటచేసే వారిని అడిగి తెలుసుకున్నారు. వండిన పదార్దాలను మెస్ కమిటీ తిన్న తరువాతే విధ్యార్ధులకు పెట్టాలని సూచించారు. తదుపరి స్టోర్ రూములోకి వెళ్లి స్టాక్ రిజిష్టర్ను పరిశీలించి దాని ప్రకారం అందులో వస్తువులను తనిఖీ చేశారు. అనంతరం జిల్లాలోని 23 మంది తాసీల్దార్లు అందజేసిన రగ్గులను 90 మంది విధ్యార్ధులకు అందజేశారు. జిల్లాలోని వసతి గృహాలలో నేడు 200 మంది విధ్యార్ధులకు రగ్గులను అందజేయడం జరిగిందని తాసీల్దార్ శ్యాంసుందర్రెడ్డి, ఏఓ సుదర్శన్రెడ్డిలు తెలిపారు. వీరి వెంట ఆర్డీఓ వేణుమాధవ్, డీఎస్సీడీఓ లత, వసతిగృహ సంక్షేమాధికారి ఉప్పలయ్య, ఏఎస్ డబ్ల్యూ ఇందిర, హాస్టల్ సిబ్బంది, పలువురు అధికారులు పాల్గొన్నారు.