కోదాడ (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ మండల ప్రాంతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తేజస్ నందలాల్ పవర్ పరిశీలించారు. బుధవారం కోదాడ పరిధిలోని తమ్మర ద్వారకుంట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు కొనుగోలు కేంద్రాల్లో ప్రతి ఒక్క బస్తాకు పట్టిలు ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని అధికారులు చెప్పారు, రైతులకు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యనారాయణ ఎంపీడీవో రామచంద్రరావు, ఎమ్మార్వో వాజిద్ అలీ, ఏవో రజిని, కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, చిమిరాల పిఎసిఎస్ చైర్మన్ కొత్త రఘుపతి, అధికారులు డైరెక్టర్లు నాయకులు పాల్గొన్నారు.