22-02-2025 12:00:00 AM
మహబూబాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) ః మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, ఇనుగుర్తి మండలాలలోని కెజిబివి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర%ళి%, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ అద్వుతై కుమార్ సింగ్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్బంగా కలెక్టర్ హాస్టళ్ళ లోని నిత్యావసర సరకులను, స్టోర్ రూం ను పరిశీలించారు.
విద్యార్దులకు నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందజేయాలని అధికారులకు తెలిపారు. నిత్యావసర సరకుల సామాగ్రిని పంపిణీ చేసే ఏజెన్సీ వారు నాణ్యమైన వస్తువులను మాత్రమే సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మండలాల తహసిల్దార్ లు, మెడికల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.