calender_icon.png 1 October, 2024 | 4:55 PM

రంగంపల్లిలో బీసీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

01-10-2024 01:19:48 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): హాస్టల్లో వసతులు, భోజనం నాణ్యత ఎలా ఉందని పెద్దపెల్లి జిల్లాలోని రంగంపల్లి బీసీ బాలుర కళాశాల వసతి గృహాన్ని రాత్రి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న వసతులు, భోజనం నాణ్యత మొదలగు వివరాలను కలెక్టర్ విద్యార్థులను అడిగారు. హాస్టల్ లో వార్డెన్ అందుబాటులో ఉంటున్నారా, మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, పారిశుధ్యం బాగా ఉందా, స్టడి అవర్స్ జరుగుతున్నాయా వంటి అంశాలను కలెక్టర్ ఆప్యాయంగా అడిగి ఆరా తీశారు. వసతి గృహం పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.