calender_icon.png 14 March, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోరెత్తిన హోలీ సంబరాలు

14-03-2025 05:18:42 PM

వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, ఏఎస్పీడీఎఫ్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు హోరెత్తాయి. కలెక్టర్ వెంకటేష్ దోత్రే క్యాంపు కార్యాలయంలో సంబరాల్లో  రెవెన్యూ శాఖ అధికారులు, జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు. ఎస్పీ డీవి శ్రీనివాస్ రావు(SP DV Srinivasa Rao) క్యాంప్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఏఎస్పీ చిత్తరంజన్ హాజరై ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ క్యాంప్ కార్యాలయం వద్ద వేడుకల్లో పాల్గొన్నారు. అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్ కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు శుభాకాంక్షలు తెలిపారు. కాగజ్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు , ఎమ్మెల్సీ దండే విఠల్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి గ్రామాలలో గిరిజనులు హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణ లోను చిన్న పెద్ద అనే తేడా లేకుండా రంగులను చల్లుతూ వేడుకల్లో మునిగిపోయారు.