calender_icon.png 19 September, 2024 | 9:37 PM

విద్యార్థులు విద్య సామర్థ్యాలు సాధించే విధంగా కృషి చేయాలి

18-09-2024 09:06:23 PM

జిల్లా కలెక్టర్  సిక్త పట్నాయక్

నారాయణపేట,(విజయక్రాంతి): జిల్లాలో విద్యార్థుల యొక్క సామర్థ్యం పెంచే విధంగా కృషి చేయాలని బుధవారం కలెక్టరేట్ ఛాంబర్ లో జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సెక్టోరల్ అధికారులు, మండలం నోడల్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మండల నోడల అధికారి యొక్క విధివిధానాలను అడిగి తెలుసుకున్నారు మండలంలో తమ విధులు చాలా ముఖ్యమైనవిగా పేర్కొన్నారు.

పాఠశాల కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లతో మమేకమై మండలంలోని ప్రతి వారము కచ్చితంగా రెండు పాఠశాలలను సందర్శించి తరగతి వారీగా పూర్తిస్థాయిలో విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పెంచే విధంగా కృషి చేయాలని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఎస్ఏ 1 పరీక్షలకు సిద్ధం చేసే విధంగా కృషి చేయాలన్నారు. కాంప్లెక్స్ సమావేశాలను గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

ఏ పాఠశాలలో నైనా సమస్యలు ఉన్నచో తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మండల నోడల్ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాఠశాలను సందర్శించిన తర్వాత కచ్చితంగా తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్ లో వివరాలను అప్లోడ్ చేయాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు శ్రీనివాస్, రాజేంద్ర కుమార్, ఇన్చార్జ్ ఏఎంఓ రామచంద్ర చారి, జిల్లా మండల నోడల్ అధికారులు పాల్గొన్నారు.