calender_icon.png 21 November, 2024 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటరు జాబితా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి

18-09-2024 08:31:41 PM

నారాయణపేట,(విజయక్రాంతి): ఓటర్ జాబితా ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ చాంబర్ లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఓటర్ల జాబితాను ఎలాంటి తప్పులు లేకుండా తయారు చేస్తున్నట్లు తెలిపారు.

భార్యాభర్తలు ఒకే వార్డులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 13.9. 24న  డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టరోల్ రోల్స్ గ్రామ పంచాయతీ నిర్వహించినట్లు 19న అన్ని రాజకీయ పార్టీలతో మండల్ లెవెల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. 26న డిస్పా్జాల్ అఫ్ ఆబ్జెక్షన్స్ 28న ఫైనల్ పబ్లికేషన్ అఫ్ ఫోటో ఎలక్టరల్ రోల్స్ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీలు ఎంపీడీవో తాసిల్దార్ కార్యాలయాలలో ఓటర్ జాబితాను  అందజేశామని వాటి పరిశీలన అనంతరం చివరిగా జాబితా సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నారాయణపేట పరిధిలోని జాజాపూర్ లో 12 వార్డులు ఉండగా ఒక కుటుంబం ఒకే దగ్గర ఆ జాబితాలో లేదని రాజకీయ పార్టీ ప్రతినిధులు అన్నారు. కొత్తగా తయారయ్యే జాబితా తమకు ఇవ్వాలని ప్రతినిధులు కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ మధు మోహన్, డీఆర్డీఎ మొఘలాప్ప, డీపీఓ కృష్ణ, డీఎల్పీఓ సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ ఎండి సలీం, ఎంఐఎం ఎండి తాహీర్, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ బీ.వెంకటయ్య, సీపీఐ బాలరాము, టీఆర్ఎస్ అలీ షైక్, సీపీఎంఎల్ కే.నారాయణ, సీపీఎం గోపాల్, టీడీపీ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.