జగిత్యాల,(విజయక్రాంతి): తహసీల్దార్లుగా వచ్చిన సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చిత్తశుద్ధితో ప్రజలకు సేవలు అందిస్తూ పదోన్నతులను పొందాలని తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా నుంచి తహసీల్దార్లుగా పదోన్నతులు పొందిన వారు శుక్రవారం జిల్లా కలెక్టర్ ను, అడిషనల్ కలెక్టర్ రాంబాబు, ఏవో పుప్పాల హన్మంత రావు లమర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రెసా జిల్లా అధ్యక్షుడు ఎండి.వకీల్, టీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్, కార్యదర్శి నాగేందర్ రెడ్డి, ట్రెసా జిల్లా కోశాధికారి చెలుకల కృష్ణ, ట్రెసా మాజీ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.