calender_icon.png 9 January, 2025 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరమ్మత్తు పనుల పట్ల కలెక్టర్ సంతృప్తి

08-01-2025 12:00:00 AM

మంథని, జనవరి 7(విజయక్రాంతి): మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టిన మరమ్మత్తు పనుల పురోగతి పట్ల జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  సంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం  మంథని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  కలెక్టర్ ఆసుపత్రి మరమ్మత్తు పనుల కోసం కలెక్టరేట్ నిధుల నుంచి ఆసుపత్రికి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు.

ఆ నిధులను వినియోగిస్తూ జిల్లా ఆసుపత్రిలో 3 వార్డులలో మరమ్మత్తు పనులు చేపట్టగా 2 వార్డులలో పనులు పూర్తి అయ్యాయని, 3వ వార్డులో పెయింటింగ్ పని జరుగుతుందని,  5 రోజులలో ఆ పనులు సైతం పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు.

 రామగిరి మండలం ప్రజా పరిషత్ కార్యాలయం తనిఖీ 

రామగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని కలెక్టర్ కోయ  శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ చేశారు.  గ్రామాలలోని నర్సరీలలో బ్యాక్ ఫీలింగ్ ఎంతవరకు పూర్తయిందని, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పురోగతి సంబంధిత అంశాలను ఆరా తీసి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట మెడికల్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ గణపతి, రామగిరి ఎంపీడీవో శైలజా రాణి, సుపరెండెంట్  ఉమేష్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.