calender_icon.png 1 October, 2024 | 2:55 PM

తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర విశేషమైనది..

26-09-2024 12:55:16 PM

కలెక్టర్ బి.యం. సంతోష్...

గద్వాల (విజయక్రాంతి) : తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర విశేషమైనది, ఆమె మహిళా చైతన్యం, శక్తికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. గురువారం ఐ.డి.ఓ.సి అవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  వీరనారి, శ్రామిక పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..  చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం భూస్వాముల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి, బహుజన ఆత్మగౌరవానికి మరియు మహిళా చైతన్యానికి మార్గం చూపారని కొనియాడారు.

ఆమె పోరాటం కేవలం వ్యక్తిగతంగా సాధించిన విజయం మాత్రమే కాకుండా, సమాజంలో అణగారిన వర్గాలకి ఒక గొప్ప ప్రేరణగా నిలిచిందాని అన్నారు. తెలంగాణ సమాజంలో విశేషంగా నిలిచిందని, తన ధైర్యంతో మహిళకు మార్గదర్శకంగా నిలిచారాని, ఆమె చూపిన ధైర్యసాహసాలను ప్రస్తావిస్తూ, తెలంగాణలో మహిళా చైతన్యాన్ని, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని పునరుద్ధరిచడం లో ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. నేటి తరానికి ఆమె చూపిన మార్గం యువత,మహిళలు ఆదర్శంగా ప్రతి ఒక్కరూ  తీసుకొని తమ జీవితాల్లో ధైర్యంగా ముందుకు సాగాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఏ.ఓ. వీర భద్రప్ప, జెడ్పీ సి.ఈ.ఓ కాంతమ్మ ,ఇంచార్జ్ బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్ బాబు, ఎస్.సి సంక్షేమ శాఖ అధికారి సరోజమ్మ, అధికారులు, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.