calender_icon.png 13 February, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైలెట్ ప్రజావాణిపై రాజస్థాన్ నుండి వచ్చిన సభ్యులతో కలెక్టర్ సమీక్ష..

12-02-2025 07:51:22 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): పైలెట్ ప్రజావాణి, ప్రజాఫిర్యాదుల పరిష్కార బహిరంగ విచారణలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా తన క్యాంప్ కార్యాలయంలో రాజస్థాన్ నుండి వచ్చిన భారతీయ సామాజిక కార్యకర్త, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్, సివిల్ సొసైటీ యాక్టివిటీ నిఖిల్ డే తో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మండలంలో ఎంపిడిఒ కార్యాలయాలలో ఫెసిలిటీస్ సెంటర్లు ప్రారంభించి ప్రతి మండలంలోని ఆర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించి వెనువెంటనే పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. 

అటు రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ప్రజావాణి మండల స్థాయిలో అదిలాబాద్ జిల్లాలోనే ప్రారంభించి సమస్యలతో ఉన్న ప్రజలు జిల్లా కేంద్రానికి, హైదరాబాద్ లాంటి దూర ప్రయాణాలు చేసి సమస్యలు చెప్పవలసిన అవసరం లేకుండా దగ్గరలో ఉన్న మండల కేంద్రములో చెప్పుకునే అవకాశం కల్పించడం అభినందనీయం అని నిఖిల్ డే అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మిత్ర రాష్ట్ర కో ఆర్డినేటర్ హర్ష తదితరులు ఉన్నారు.