నారాయణపేట. జనవరి 31(విజయ క్రాంతి) : నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మండలానికి చెందిన అధికారులతో పలు అభివద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు పై సమీక్ష జరిపారు.
ఈ సమీక్షలో ప్రధానంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ పథకాలపై గ్రామాల వారీగా అర్హుల జాబితా వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకు న్నారు. ఆయా జాబితాలపై కూలంకషంగా చర్చించా రు. ఆయా పథకాలకు అర్హుల జాబితాను ఏ ప్రాతిపదికన తయారు చేశారని సంబంధిత అధికా రులను కలెక్టర్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజక వర్గంలోనే మద్దూరు మండలం ఉందని అధికారులు గుర్తుపెట్టుకుని పనిచేయాలని, ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగిన శాఖా పరమైన చర్యలు ఉంటా యని కలెక్టర్ సున్నితంగా హెచ్చరించారు. సమీక్షా సమావేశం ఉంటుందని ముందుగానే సమాచారం ఇచ్చినా కూడా ఎందుకు అన్ని వివరాలతో సమావే శానికి రాలేదని ఇద్దరు ముగ్గురు అధికారులను ఆమె నిలదీశారు.
గతనెల జనవరి 26 న మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో నాలుగు పథకాల కు సం బంధించి ఎంతమందికి మంజూరీ పత్రాలను అంద జేశారని అడిగారు. అలాగే మండల మొత్తంగా ఆయా పథకాలకు ఎంతమంది దరఖాస్తు చేసుకు న్నారని?ఎన్ని బందాలు సర్వే చేశాయని? వారిలో ఎంతమందిని అర్హులుగా నిర్ధారించారని అడిగి తెలుసుకున్నారు.
ఆత్మీయ భరోసా పథకం కింద మండలంలో మొత్తం డిస్పోజ్ చేయాలన్నారు. అభ్యంతరాలు ఎన్ని వచ్చాయన్నారు. అన్నింటినీ తిరస్కరించవద్దని చెప్పారు. ఎంపీడీవో గైడ్ చేయాల న్నారు. డిఆర్డిఓ సైతం అధికారులతో సమీక్ష జరిపి మార్గ నిర్దేశం చేయాలన్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మధ్యాహ్న భోజన పథకం మెనూ ప్రకారం అమలవుతుందా లేదా అని ఎంఈ ఓ ను ప్రశ్నించారు.
ఖచ్చితంగా మోను ఫాలో కావా లన్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి న కలెక్టర్ కు మండలంలోని పల్లెర్ల,నందిపాడు పాఠ శాలల్లో పాత బియ్యం ఉన్నాయని, ఇటీవలే ఆ బియ్యాన్ని మార్పించి, కొత్త బియ్యాన్ని తెప్పించడం జరిగిందనీ ఎంఈఓ కలెక్టర్ కు వివరించారు. వంట ఏజెన్సీ, నూనె, ఇతర నిత్యావసర సరుకులను అధి కారులకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.
సమస్యలు ఏమైనా ఉంటే తన దష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ నెలలో ఎవరెవరు ఎన్ని పాఠశాలలను విజిట్ చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో క్షేత్రస్థాయిలో పరిశీలించి రిమార్క్స్ తో పాటు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కలెక్టర్ కోరారు. కొన్ని పాఠశాలలలో ఉపాధ్యాయులు ఇంటి నుంచి కూర గాయలు తెచ్చుకుంటున్నారని అధికారులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
మండలంలో తమకు కేటాయిం చిన పాఠశాలలన్నింటికి వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెగ్యులర్ గా అదే విధంగా పరిశీలన చేయాలని కలెక్టర్ ఆదేశిం చారు. కొత్త మున్సిపాలిటీ గా ఏర్పడిన మద్దూరు లో పక్కనే ఉన్న చాపన్ చెరువు తండా, ఎర్రగుట్ట తండా, భీంపూర్ నాగంపల్లి గ్రామాలను విలీనం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆయా గ్రామాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మద్దూరు రోడ్డు విస్తరణ పనులు ఎంత వరకు వచ్చాయని, పనులను వేగంగా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. కొత్త మున్సిపాలిటీ కి ఎంత మంది అధికారులను నియమించారని కలెక్టర్ ప్రశ్నించగా నారాయణపేట మున్సిపాలిటీ కి చెందిన ఇంజినీర్, టీపీఓ, అకౌంటెంట్ ను మద్దూ రు మున్సిపాలిటీకి ఇన్ చార్జీలుగా ప్రభుత్వం నియ మించినట్లు ఇన్ చార్జీ కమిషనర్ నాగరాజు తెలిపా రు.
మద్దూరు మున్సిపాలిటీ జనాభా వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ నాలుగు గ్రామాలు విలీనం అయితే మద్దూరు మున్సిపాలిటీ జనాభా 20 వేలు దాటుతుందని తెలిపారు. ఈ మున్సిపాలి టీ లో అభివద్ది, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అధికా రులంతా సమన్వయంతో అర్హులందరికీ అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమీక్షలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా సివిల్ సప్లు అధికారి సుదర్శన్, తహసిల్దార్లు మహేష్ గౌడ్, జయ రాం, ఎంపీడీఓ లు నరసింహ రెడ్డి, కష్ణా రావు, ఎంఈఓ బాల కిష్టప్ప, ఎంపీఓ రామన్న, ఇరిగేషన్ ఏఈ మమత, వ్యవసాయశాఖ ఏ.వో, ఏపీఓ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.