వీధి కుక్కల నియంత్రణకు ఎనిమల్ బర్త్ కేర్ సెంటర్ ప్రారంభం
నాగర్‌కర్నూల్, జనవరి 29 (విజయ క్రాంతి): గ్రామాల్లో వీధి కుక్కలు పెరిగి కుక్క కాటుతో సామాన్యులు బలవుతున్నారని ఈనెల 14న విజయక్రాంతి “వీధి కుక్కల నియంత్రణలో వీడని నిర్లక్ష్యం” పేరుతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించగా జిల్లా కలెక్టర్ భద్రవత్ సంతోష్ స్పందించారు.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని వీధి కుక్కలను పట్టుకునేందుకు డాగ్ క్యాచర్ కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకొని బుధ వారం స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డితో కలిసి ఎనిమల్ బర్త్ కేర్ సెంటర్ ను ప్రారంభించారు. పట్టణ ప్రగతి నిధులు 60 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా వీధి కుక్కలకు రేబి స్, పార్వోవైరస్, డిస్టెంపర్ వంటి వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య పరీక్షలు అందించను న్నట్లు తెలి పారు.
స్టెరిలైజేషన్ (నసబంధి) ఆపరేషన్ చేసి తిరిగి వాటిని వాటి సహజ జీవావర ణంలో వదిలే విధానాన్ని అమలు చేస్తారని తెలిపారు. ఇది వీధి కుక్కల పెరు గుదల నియంత్రణతో పాటు వాటి ఆరోగ్యా న్ని మెరుగుపరిచేలా ఉంటుంద న్నారు. వారి వెంట అదనపు కలెక్టర్ దేవ సహాయం, జిల్లా పశు వైద్య శాఖ అధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ నరేష్, ప్రజాప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.