calender_icon.png 28 April, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా జడ్జి భరతలక్ష్మిని కలిసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

26-04-2025 12:32:00 AM

నిజామాబాద్, ఏప్రిల్ 25 :(విజయ క్రాంతి):  నిజామాబాద్ జిల్లా జడ్జిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జిల్లా న్యాయమూర్తి జీ.వీ.ఎన్.భరతలక్ష్మిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనంలోని జిల్లా జడ్జి ఛాంబర్లో ఆమెకు పూల మొక్కను అందించి స్వాగతం తెలియజేశారు. ఇరువురు కొద్దిసేపు భేటీ అయ్యి జిల్లా స్థితిగతులపై చర్చించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ అన్నారు.