ఆదిలాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదివితే పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కష్టమేమీ కాదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah) అన్నారు. పదో తరగతిలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. సోషల్ వెల్ఫేర్(Social Welfare), బీసీ వెల్ఫేర్(BC Welfare) ఆధ్వర్యంలో స్థానిక బీసీ స్టడీ సర్కిల్(Local BC Study Circle)లో ఫ్రీ మెట్రిక్ వసతి గృహ 10వ తరగతి విద్యార్థులకు గురువారం నిర్వహించిన ప్రేరణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు వార్షిక పరీక్షలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. అదేవిధంగా సైకాలజీ మోటివేషన్ క్లాస్ లో స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులో ఉండే భయం పోయే విధంగా ఎగ్జామ్ లో మంచి మార్కులు వచ్చే విధంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ ఎస్సి సంక్షేమ శాఖ అధికారులు రాజలింగు, సునీత కుమారి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.