calender_icon.png 19 September, 2024 | 9:53 PM

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి

18-09-2024 08:55:48 PM

రీజనల్ సైనిక్ వెల్ఫేర్ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, (విజయక్రాంతి): దేశం కోసం సేవలందించి పదవి విరమణ పొందిన మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ లో 8లక్షలతో నుంతంగా నిర్మించిన రీజనల్ సైనిక్ వెల్ఫేర్ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్ ప్రారంభించి, మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో రీజనల్ సైనిక్ వెల్ఫేర్ బోర్డు మీటింగ్ నిర్వహించారు.

ఈ మీటింగ్ లో సైనిక్ వెల్ఫేర్ కార్యక్రమాలైన ఐడి కార్డు జారీ చేసే విధానం, హౌస్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్, క్యాంటిన్ ఏర్పాటు కొరకు వైద్య సదుపాయాలు కల్పించుట.  స్వయం ఉపాధి రుణాల కోసం లీడ్ బ్యాంకు మేనేజర్ ద్వారా పరిశ్రమల శాఖ ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలు మ్యారేజ్, చదువు కొరకు తదితర సంబందించిన విషయాలను చర్చించడం జరిగింది. అదేవిధంగా సిరికొండ కు చెందిన అమర జవాన్ భార్య పూజ కు 2 లక్షల చెక్కును కలెక్టర్ చేతులమీదుగా అందించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, జిల్లా యువజన క్రీడా, సైనిక్ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సంబంధాల అధికారి బి.తిరుమల, జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా, లీడ్ బ్యాంకు మేనేజర్, పరిశ్రమల శాఖ పర్యవేక్షకులు, మాజీ సైనిక సంఘం అధ్యక్షులు శంకర్ దాస్, ఉప అధ్యక్షులు అశోక్, సెక్రెటరీ మోహన్, క్యాషియర్ దేవన్న, మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యులు భాస్కర్ రెడ్డి, రవి, డిబి చారి, సత్తయ్య, మధు, తదితరులు పాల్గొన్నారు.