ఆదిలాబాద్,(విజయక్రాంతి): మహిళ సంఘాలకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు అనేక విధాలుగా కృషి చేస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా(Collector Rajarshi Shah) అన్నారు. జైనథ్ మండలంలోని సరస్వతి గ్రూప్ కు చెందిన టామ్రే సునీతకు ఇందిరా మహిళా శక్తి పథకం(Indira Mahila Shakti Scheme) కింద మంజూరైన మొబైల్ చేపల విక్రయ వాహనాన్ని(Mobile Fish Vending Vehicle) సోమవారం జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహన విశేషాలు, విక్రయాల తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మొబైల్ చేపల విక్రయ వాహనంలో అనేక రకాల చేపల వంటకాలు లభిస్తాయని తెలిపారు. దింతో మహిళ సంఘాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ రవీందర్ రాథోడ్, జిల్లా మత్స్య శాఖ అధికారి భాస్కర్, తదితరులు ఉన్నారు.