calender_icon.png 24 January, 2025 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

02-09-2024 03:15:26 PM

పెన్ గంగ నది ఉధృతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు...

ఆదిలాబాద్, (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల దృష్ట్యా ఆదిలాబాద్ జిల్లాలోని వరద ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పర్యటించారు. ఇందులో భాగంగానే సోమవారం తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులోని జైనథ్ మండలంలోని డోల్లారా వద్ద పెన్ గంగ నది వద్ద వరద ఉధృతిని, రాకపోకలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ లు అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా వరద ప్రాంతాల్లో అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడు పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, పోలీసులు ఉన్నారు.