calender_icon.png 21 November, 2024 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్ ఫ్రీ మెదక్‌గా మార్చుదాం

29-10-2024 09:10:09 PM

మెదక్,(విజయక్రాంతి): ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని మెదక్ ను డ్రగ్ ఫ్రీ మెదక్ గా మార్చాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరియు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి డ్రగ్ అబ్యూస్ ఇన్ యూత్ అనే శిక్షణ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ వారు విజయవంతంగా శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. మంగళవారం  యాంటీ డ్రగ్ సోల్జర్ పోస్టర్ను మెదక్ జిల్లా  కలెక్టర్  రాహుల్ రాజ్  చేతులమీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్  మాట్లాడుతూ... డ్రగ్స్ వినియోగం మహమ్మారిగా మారిందని, దీని ద్వారా యువత వారి జీవితాలను, వారి కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డ్రగ్ సమస్యను అరికట్టాలంటే కేవలం పోలీస్ వ్యవస్థ మాత్రమే కాకుండా వారితో పాటుగా వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, సమాజంలో ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని మాఫియాను అరికట్టాలని తెలియజేశారు. డ్రగ్ సరఫరా చేసేవారు, తీసుకున్న వ్యక్తులు, మీ ఏరియాల్లో తారసపడినట్లయితే వెంటనే TGANB టోల్ ఫ్రీ నెంబర్ 1908 కి తెలియజేయాలని, మెదక్ ను డ్రగ్ ఫ్రీ మెదక్ గా మార్చాలని కోరారు.