27-03-2025 12:38:47 AM
రామాయంపేట, మార్చి 26ః రామాయంపేట పట్టణంలోని సిద్దిపేట చౌరస్తాలో ఉన్న మీసేవా కేంద్రాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మండల తహసిల్దార్ రజనీకుమారి తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రామాయంపేట మండలంలో రాజీవ్ యువ వికాస పథకం క్రింద ఆన్లైన్ లో యువకులకు నాలుగు లక్షల వరకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాల దరఖాస్తుల కోసం,కులం,ఆదాయ ధ్రువపత్రాల ప్రక్రియను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన యువకులు ఈ పథకం కింద ఈనెల 20 నుండి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ వచ్చేనెల 5వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. అయన వెంట మండల తహసిల్దార్ రజనీకుమారి తదితరులు ఉన్నారు.