calender_icon.png 1 February, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్

29-01-2025 12:00:00 AM

ఆసుపత్రిలోని అన్ని విభాగాల పరిశీలన

మెదక్, జనవరి 28(విజయక్రాంతి): మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్ సీలోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు.

ప్రతి రోజూ హాస్పిటల్ కు ఎంత మంది రోగులు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ నెలలో ఎన్ని డెలివరీల జరిగాయని డాక్టర్ సాయి సింధూను కలెక్టర్ అడగగా ఇప్పటిదాకా రెండు కేసులు పూర్తి చేశామని వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత , పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచాలని ఆదేశించారు.