హనుమకొండ: బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం పనులను బుధవారం జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, జిడబ్ల్యుఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, కూలీల సంఖ్యను పెంచాలని అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనులు జరుగుతున్న కాళోజి కళాక్షేత్రంలోని పెయింటింగ్స్, టైల్స్, ఎలక్ట్రికల్, ప్లంబర్, ఫ్యాబ్రికేషన్, లాన్ తదితర పనులను కలెక్టర్ పరిశీలించి వాటికి సంబంధించిన పనుల పురోగతి వివరాలను అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పనుల త్వరతగతిన పూర్తి చేయాలనీ కూలీల సంఖ్యను పెంచి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.