భీమదేవరపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సీఎం కప్ 2024ను విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో గురువారం రాత్రి సీఎం కప్ నిర్వహణపై సన్నహక సమావేశం జరిగింది. సీఎం కప్ తొలుత గ్రామ, మండల, జిల్లా స్ధాయిలోవివిధ కమిటీల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీలలో అధిక సంఖ్యలో క్రీడాకరులు పాల్గొనే విధంగా చూడలన్నారు. క్రీడాకారులకు భోజనం, విజేతలకు జ్ఞాపికలు, సర్టిఫికెట్‌లు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి అశోక్‌కుమార్ మాట్లాడుతూ వచ్చే నెల 7,8 తేదీలలో గ్రామస్ధాయిలో, మండల స్ధాయిలో10 నుండి12 వరకు జిల్లా స్ధాయిలో 16 నుండి 21 వరకు ఎంపిక చేసిన క్రీడాకారులతో పోటీలు జరుగుతాయన్నారు. సమావేశంలో మున్సిపల్ కమీషనర్ అశ్విని తానాజీ, అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి, జడ్పీసీఈవో పలువురు అధికారులు పాల్గొన్నారు.