16-04-2025 05:45:29 PM
కలెక్టర్ పమేలా సత్పతి..
హుజురాబాద్ (విజయక్రాంతి): వసతి గృహాల్లో విద్యార్థినులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి(District Collector Pamela Satpathy) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ పరిధిలోని కేసి క్యాంప్ వద్దగల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల వసతి గృహాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ సందర్శించారు. తరగతి గదులను పరిశీలించారు విద్యార్థులు ఎస్-ఏ-2 హిందీ పరీక్షలు రాస్తుండడంతో వసతుల ఏర్పాట్లపై ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లోని గదులను, డైనింగ్ హాల్, కిచెన్ ను సందర్శించారు అని సిబ్బందికి సూచించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
మిషన్ భగీరథ గ్రీడ్ పరిశీలన..
మిషన్ భగీరత గ్రిడ్ కార్య నిర్వహణ ఇంజనీరింగ్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సందర్శించారు. ఇంట్రా, డివిజన్, గ్రిడ్ కార్యాలయ గదులను, ల్యాబ్ ను పరిశీలించారు. వేసవి కాలం దృష్ట్యా మిషన్ భగీరథ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీటి సరఫరలో సమస్యలు వేణు వెంటనే పరిష్కరించాలని సూచించారు. పురపాలక సంఘం కార్యాలయాన్ని పరిశీలించి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు మెప్మా సిబ్బంది ఆధ్వర్యంలో పొడి చెత్తను సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఆర్డీవో రమేష్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, రిసోర్స్ పర్సన్లు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.