calender_icon.png 20 September, 2024 | 9:55 PM

బాలికల వసతి గృహం సందర్శించిన కలెక్టర్ పమేలా సత్పతి

20-09-2024 08:15:14 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): హుజురాబాద్ లోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని, కేసి క్యాంప్ లోని బీసీ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులు ఉంటున్న గదులను పరిశీలించారు. విద్యార్థులకు ఇస్తున్న ఆహారం మెనూ, వసతుల గురించి వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు. సందర్శనలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి, ఆర్డీవో రమేష్ బాబు, తహసిల్దార్ ఎంపీడీవో ఉన్నారు.