calender_icon.png 23 December, 2024 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశుభ్రమైన చేతులు - ఆరోగ్య ప్రదాతలు

14-10-2024 06:20:01 PM

కరీంనగర్,(విజయక్రాంతి): ప్రతినిత్యం, అత్యవసర, అతి ముఖ్య సమయాలలో తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, తద్వారా చేతుల అపరిశుభ్రత వల్ల వచ్చు అనేక వ్యాధులను దూరం చేసుకోగలుగుతామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. అక్టోబర్ 15  ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవం సందర్భంగా యూనిసెఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన 'బ్యానర్' ఆవిష్కరిస్తూ.. ప్రజలందరికీ, ప్రత్యేకంగా పారిశుధ్య పనులలో నిమగ్నమయ్యే కార్మికులకు, "చేతుల పరిశుభ్రత" విషయాన్ని చేరవేయాలని, యూనిసెఫ్ ఈ  దిశగా తమ వంతు ప్రయత్నం చేస్తుందని ఉద్ఘాటించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో, పాఠశాలల్లో, మహిళా సంఘాల సమావేశాల్లో, " చేతుల శుభ్రత -  ఆరోగ్య భద్రత" అంశాన్ని విస్తృత ప్రచారం చేయాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, సహాయ కలెక్టర్ (శిక్షణ )అజయ్ యాదవ్, అధికారులు డిఆర్డిఓ శ్రీధర్, సీఈవో శ్రీనివాస్ ,డిపిఓ రవీందర్ ,మున్సిపల్ కమిషనర్ చహత్ బాజ్పాయ్, డీఈవో జనార్దన్ రావు, యూనిసెఫ్ రాష్ట్ర ప్రతినిధి కాశీనాథ్,   జిల్లా సమన్వయ కర్త కిషన్ స్వామి, ఎస్బిఎం రమేష్, వేణు, కళ్యాణి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.