calender_icon.png 23 December, 2024 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ పమేలా సత్పతి

14-10-2024 06:13:42 PM

కరీంనగర్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములను సోమవారం కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారుల సమక్షంలో సీలు  తీయించి గదిలో ఉన్న ఈవీఎం వీవీ ప్యాట్లను పరిశీలించారు. అనంతరం సీలు వేయించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఎప్పటి కప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎం గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో ట్రైనీ ఐఏఎస్ అజయ్ కుమార్, ఆర్డిఓ మహేశ్వర్, రాజకీయ పార్టీల నాయకులు మడుపు మోహన్ చారి (కాంగ్రెస్), సత్తినేని శ్రీనివాస్ (బీఆర్ఎస్), నాంపల్లి శ్రీనివాస్ (బీజెపీ), వాసుదేవరెడ్డి సీపీఐ(ఎం), కళ్యాణపు ఆగయ్య (టీడీపీ), సిరిసిల్ల అంజయ్య (బీఎస్పీ) పాల్గొన్నారు.