కరింనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ కలెక్టరేట్లో సిబ్బందికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మట్టితో తయారుచేసిన గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాలను పూజించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసిన విగ్రహాలు నీటిలో కరగకపోవడం వల్ల నీటి కాలుష్యం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి పవన్ కుమార్, మెప్మా పీడీ స్వరూపారాణి పాల్గొన్నారు.