calender_icon.png 27 January, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహానీయుల చరిత్రను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలి

26-01-2025 12:50:28 AM

హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య 

భీమదేవరపల్లి,(విజయక్రాంతి): భావితరాలకు చెందిన యువత మహానీయుల చరిత్రను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలనిహనుమకొండ జిల్లా కలక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. శనివారం యుఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు మాలోత్ రాజేశ్‌నాయక్ మహానీయుల చరిత్రతో ముద్రించిన క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవ్కిరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహానీయుల స్పూర్తితో యువత ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు. సమాజ అభివృద్ధి కి తోడ్పడే నేటి బాలలే రేపటి పౌరులన్నారు. దేశ అభివృద్ధికి పాటుపడే మంచి కార్యక్రమాలు చేయాలని సంఘ నాయకులకు కలెక్టర్ సూచించారు. క్యాలెండర్ ఆవిష్కరణలో రాకేశ్, పవీణ్‌నాయక్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.