భీమదేవరపల్లి,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు వెంటనే ఆన్లున్ చేయాలన్నారు. అదే గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడీ చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్నారు.కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బాల్య వివాహ రహిత జిల్లా మారుద్దామన్నారు. బాలికలకు బాల్యంలో వివాహాం చేయడం వల్లవారి భవిష్యత్తుకు ఆటంకం కలుగుతుందన్నారు. పరకాల మండలం కామరెడి పల్లిలో సీసీఐ ద్వారా పత్తికి మంచి గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు. పత్తి కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలన్నారు. హనుమకొండ జిల్లా గుడప్పాడ్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే వివరాల నమోదులో ఎన్యూమరేటర్లు డేటా ఎంట్రీ ఆపరేటరు ్లనమోదు చేసిన అన్ని వివరాలను సమగ్రంగా ఉన్నాయా లేదాఅని సరి చూసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిట్ చేయాలన్నారు. కలెక్టర్ వెంట పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.