calender_icon.png 28 September, 2024 | 6:54 AM

కలెక్టర్ ఆదేశాలకే దిక్కులేదు

27-09-2024 01:03:56 AM

  1. సర్వే చేయాలని చెప్పినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు, సిబ్బంది
  2. వేంకటేశ్వరస్వామి మాన్యంపై అక్రమార్కుల కన్ను

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 2౬ (విజయక్రాంతి): కలెక్టర్ ఆదేశాలను రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. గుడిపా డు మోక్ష వేంకటేశ్వరస్వామి ఆలయ భూ ముల సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని చె ప్పినా పెడ చెవిన పెడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలో ని గుడిపాడు మోక్ష వేంకటేశ్వరస్వామి ఆల య భూమి ఆక్రమణలకు గురవుతోందని, సర్వే చేసి హద్దులు నిర్ణయించి భూములు కాపాడాలని గ్రామస్థులు, దేవాదాయ శాఖ అధికారులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

2021లో అప్పటి కలెక్టర్ అనుదీప్ గుడిపా డు సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని అప్ప టి పాల్వంచ తహసీల్దార్‌ను ఆదేశించారు. కా నీ ఇప్పటి వరకు ఆదేశాలు అమలు కాలేదు. రెవెన్యూ రికార్డుల్లో 1958 నుంచి దేవాదాయ శాఖ భూములుగా ఉన్నా ఎందుకు సర్వే చేయడంలేదనే విమర్శలొస్తున్నాయి. కాకతీయుల కాలం నాటి వేంకటేశ్వరస్వామి ఆలయానికి 21.30 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూములకు ఆనుకొని ఇనాం పట్టాలు ఉండటం ఆక్రమణదారులకు వరంగా మారి ంది. రెవెన్యూ అధికారుల సహాయంతో దేవుని మాన్యం భూములను ఆక్రమించుకుంటున్నారు.

2019లో ఎకరం భూమి ఆక్రమణ కు గురైందన్న ఆరోపణలు వెలువడ్డాయి. మస్తాన్‌రావు తహసీల్దార్‌గా ఉన్న సమయంలో గుడిపాడు అంగన్‌వాడీ కేం ద్రానికి, ప్రభుత్వ పాఠశాలకు 5 ఎకరాలు భూమిని కేటాయించారు. అదే అదనుగా కొందరు దే వాలయ భూమిని ఆక్రమించుకున్నారు. ఆల య భూముల్లో ఇంటి నిర్మాణా లు చేపట్టారు. కొందరు దేవుని భూములపై తప్పుడు పట్టా లు సృష్టించి ఇతరులకు విక్ర యించారనే ఆరో పణలొచ్చాయి. 2021 ను ంచి  ఆలయ భూ ములను సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదు.

దీం తో ప్రస్తుతం కేవలం 5 ఎకరాలు మాత్రమే మిగిలింది. సుమారు 12 ఎకరాల భూమి అక్రమార్కుల చేతిలో ఉ ంది. మోక్ష వెంకటేశ్వర. స్వామి ఆలయ భూములపై 2021లో దేవా దాయ శాఖ అధికారులు సర్వే నిర్వహించగా 104 ఇండ్లు, 2 అ ంగన్‌వాడీ భవనాలు, పాఠ శాల భవనం మొ త్తం 107 నిర్మాణాలు ఉన్న ట్టు తేలింది. ఆ త ర్వాత కూడా కొందరు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఈవో రజనీకుమారి ఇళ్ల నిర్మాణాలను తొలగించాలని ఆదేశించినా ఇప్పటివరకు తొలగించలేదు.

సర్వే చేయకుండా జాప్యం చేస్తున్నారు

దేవుని మాన్యం భూ మి ఆక్రమణకు గురైన మాట వాస్తవమేనని ఈవో రజనీకుమారి స్పష్టం చేశారు. మాన్యం భూములపై సర్వే చేసి హద్దులు నిర్ధారించా లని రెవెన్యూశాఖను 2021 నుం చి కోరుతున్నా ఏదో సాకులు చెబుతూ జాప్యం చేస్తూ  వస్తున్నారని తెలిపారు. ఆ దేవాలయానికి ఎలాంటి కమిటీ లేదని, ఎవరైనా అధ్యక్షుడిగా చెప్పుకుం టూ చెలామణి అయితే ఎండోమెంట్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 

ఈవో రజనీ కుమారి