calender_icon.png 21 October, 2024 | 4:09 PM

కలెక్టర్ కు అస్వస్థత

21-10-2024 01:46:08 PM

పోలీస్ అమర వీరుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సోమవారం జిల్లా కేంద్రం లోని పోలీస్ పరెడ్ గ్రౌండ్ లో ఎస్పీ డి వి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరవీరుల దినోత్సవ వేడుకల్లో హాజరు అయ్యారు. అమరవీరులను స్మరించుకొని వారి ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం నివాళులు అర్పించే క్రమంలో కలెక్టర్ అస్వస్థతకు గురికావడంతో తన సహాయకుడు వెంటనే స్పందించి కలెక్టర్ ను పట్టుకున్నాడు. అనంతరం పళ్ళ రసం తాగిన కలెక్టర్ కాసేపు కుర్చీలో సేద తీరాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కలెక్టర్ అస్వస్థతకు గురయ్యాడు.