calender_icon.png 22 December, 2024 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంజేపీ గురుకులంలో కలెక్టర్ రాత్రి బస

13-09-2024 02:14:08 AM

 విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ 

హనుమకొండ, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కమ లాపూర్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల బాలికల పాఠశాలలో కలెక్టర్ ప్రావిణ్య గురువారం రాత్రి బస చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురుకుల పాఠశాల, కళాశాలలో నెలలో ఒక రాత్రి బస కార్యక్రమంలో భాగంగా కమలాపూర్‌లోని గురుకుల బాలికల పాఠశాలకు కలెక్టర్ వచ్చారు.  విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంజేపీలో విద్యార్థినులతో కలిసి రాత్రి బస చేసేందుకు వచ్చినట్టు తెలిపారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేయ డం సంతోషంగా ఉందన్నారు.