14-04-2025 12:17:53 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): జాతీయ ఓబిసి చైర్మన్ హన్సా రాజ్ అహిరి తో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆదివారం కలెక్టరేట్ లో భేటీ అయ్యారు. జిల్లా కేంద్రానికి ప్రవేట్ కార్యక్రమానికి హాజరు అయిన ఓబీసీ చైర్మన్ కు కలెక్టరేట్ వద్ద కలెక్టర్ వెంకటేష్ దోత్రే పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కలెక్టరేట్ లో కాసేపు సమావేశం అయ్యి పలు అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చైర్మన్ తెలుసుకున్నారు.