calender_icon.png 3 April, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ను కలిసిన కలెక్టర్

02-04-2025 04:37:59 PM

భద్రాచలం (విజయక్రాంతి): ఈనెల 6, 7వ తేదీలలో భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం, పట్టాభిషేకం మహోత్సవాల వేడుకలకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం భద్రాచలం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కలిసి స్వాగతం పలికారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం పట్టాభిషేకం మహోత్సవమునకు జరుగుతున్న ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్ ను దేవదాయ శాఖ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారుల సహకారముతో స్వామివారి కల్యాణ మహోత్సవం పట్టాభిషేకం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ కమిషనర్ కు వివరించారు.