calender_icon.png 24 April, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

24-04-2025 02:25:08 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గా బాధ్యతలు స్వీకరించిన జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపేట నుండి మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన జడ్జిని కలెక్టర్ కలిసి పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా జడ్జి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన వివిధ విషయాలను కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.