calender_icon.png 31 January, 2025 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

31-01-2025 12:00:00 AM

కరీంనగర్, జనవరి30(విజయక్రాంతి): ఎన్నికల ప్రవర్తనా నియామవళి తదితర అంశాలపై గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావే శం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ నిజామాబాద్ ఆదిలా బాద్ కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ వర్గాలకు షెడ్యూల్ వెలువడినందున ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అన్నా రు.

మార్చి 8 వరకు కోడ్ అమలులో ఉం టుందని తెలిపారు.ప్రజలను ప్రభావితం చేసేలా ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు, గోడలపై రాతలు, చిత్రపటాలు తొలగించామని అన్నా రు.  ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏ ర్యాలీల కైనా, సమావేశాలకైనా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.

ఏమై నా ఫిర్యాదులు ఉంటే అభ్యర్థులు గాని, ఇత రులు గాని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరించే ఆర్డిఓలకు తమ ఫిర్యాదులు అందజేయాలని తెలిపారు. ఇప్పటికే జిల్లా లోని బెల్ట్ షాపులను మూసి వేసినట్లు తెలి పారు. వాహనాల వినియోగానికి ఏఆర్వోల అనుమతి తప్పనిసరిగా తెలిపారు.

పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు వివరాలను నమోదు చేస్తామని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించరా దని, ఉల్లంఘిస్తే నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటామని అన్నారు. మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గానికి సంబంధించి 15 జిల్లాలు, 35 డివిజన్లు, 271 మండలాలు ఉన్నాయని తెలి పారు.

499 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయ నున్నట్లు తెలిపారు. డివిజన్లలో ఆర్డీవోలు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరి స్తారని తెలిపారు. ఉపాధ్యాయుల నియోజక వర్గానికి 274 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషన ల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, డిఆర్‌ఓ వెంక టేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.