18-02-2025 12:00:00 AM
నిర్మల్, ఫిబ్రవరి 17(విజయక్రాంతి) ః జిల్లాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 27న ఎన్నికల పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పట్టభద్రులు ఉపాధ్యాయులు ఓటు వేసేటప్పుడు ప్రభుత్వం గుర్తింపు పొందిన కార్డుతో ఓటు వేయవచ్చని సూచించారు. ఎన్నికల సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో మదన కలెక్టర్ కిషోర్ కుమార్ డిఆర్‌ఓ రత్న కళ్యాణి రెవిన్యూ శాఖ అధికారులు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.