21-03-2025 08:21:31 PM
కొండపాక: కొండపాక మండల కేంద్రంలో ఉన్న ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి(Collector Manu Chowdary) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, పూజారులు శాలువా, పువ్వుల దండతో కలెక్టర్ ను సన్మానించారు. అనంతరం ఆనంద నిలయంలో వృద్ధుల గదులను, పరిసరాలను, డైనింగ్ హాలు వసతులను పరిశీలించి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బాలసదానంలో ఉన్న చిన్నారులు వారి సౌకర్యాలను పరిశీలించి, ఏ రంగంలో విజయం సాధించాలన్న ఇప్పటినుంచి క్రమశిక్షణతో కష్టపడి చదవాలని, వార్తాపత్రికలు చదవాలని, కంప్యూటర్ నాలెడ్జి పెంచుకోవాలని అన్నారు. కంప్యూటర్ ను అందిస్తానని తెలిపారు. ప్రధాన రహదారి నుంచి ఆనంద నిలయం వరకు రోడ్డును నిర్మించాలని ట్రస్ట్ సభ్యులు కోరడంతో, రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గజ్వేల్ పంచాయతీరాజ్ ఈఈ చిరంజీవికి సూచించారు. ఈ కార్యక్రమంలో కొండపాక మండల తాహసీల్దర్ దిలీప్ కుమార్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఆనంద నిలయం ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.