calender_icon.png 1 February, 2025 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

31-01-2025 01:27:58 AM

గంట పాటు అన్ని వార్డుల పరిశీలన

నారాయణపేట, జనవరి 30(విజయ క్రాంతి): నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  దాదాపు  గంటల పాటు కలెక్టర్ ఆసుపత్రి లోని  అన్ని వార్డులను కలియ తిరిగి పరిశీ లించారు.  ముందుగా ఆస్పత్రిలోని పీపీ యూనిట్ కి వెళ్లి ఏ ఎన్ సి రిజిస్ట్రేషన్, వాక్సినేషన్ గురించి  మెడికల్ అధికారి బాలాజీ ని అడిగి తెలుసుకున్నాను.

తర్వాత బ్లడ్ బ్యాంక్ లో నిల్వ ఉన్న రక్త నిల్వల రిజి స్టర్లను పరిశీలించి, బ్లడ్ బ్యాంకులో ఎంత మంది పనిచేస్తున్నారని ఆరా తీశారు. ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన బ్లడ్ ప్యాకెట్లను చూసి, ఏ ఏ బ్లడ్ గ్రూప్ రక్తం అందుబాటులో ఉందని అడిగారు. కాల పరిమితి దాటిన వాటిని ఉపయోగించ వద్దని ఆదేశించారు. ప్లేట్ లెట్ల ప్యాకెట్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. సింగిల్ డోనర్ ప్లేట్ లెట్స్ తీసే విభాగంలో యంత్రాన్ని చూసి పని చేస్తుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఔట్ పేషంట్ విభాగంలో రోజుకు ఎంతమంది రోగులు వస్తుంటారని కంప్యూటర్ లో రోగుల పేర్లను చూశారు. ఇన్ వార్డుకి వెళ్లి అక్కడ చికిత్స పొడుతున్న రోగులతో మాట్లా డి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరాతీశారు. బెడ్లపై దుప్పట్లను ఎప్పటిక ప్పుడు మార్చాలని అక్కడి సిబ్బందికి సూచించారు. వార్డులను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పై అంతస్తు భవనంలో  కొత్తగా ఏర్పాటు చేసిన వార్డును, ఎక్స్ రే, ఐసిటిసి విభాగాన్ని చూశారు.

అలాగే వెనక వైపు గల మెటర్నటి వార్డు, ఆపరేషన్ థియే టర్,  సీ సెక్షన్ వార్డు,  ఆర్థోపెడిక్, సర్జికల్ వార్డు, జనరల్ వార్డును పరిశీలించారు. చివ రగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ మోహన్, ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్ష జరిపారు.  రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా నారాయణ పేట మెడికల్ కళాశాల, జిల్లా ఆసుపత్రిని సందర్శించినప్పు డు  జిల్లా ఆసుపత్రిలోని 8 విభాగాలను మెడికల్ కళాశాల కింద అంతస్తులోకి మార్చే విషయంపై చర్చించారు.

అయితే ఆసుపత్రి పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, ఎప్పుడు ఎవరిపై పడుతుందోనని భయాందోళన  పరిస్థితి నెలకొందని, ఆస్పత్రి భవనం మరమ్మతు పనులు చేసే వరకు మెడికల్ ఆసుపత్రిలోనే అన్ని విభాగాలను మార్పు చేసి ఇక్కడ మాత్రం ఏం సీ హెచ్ ( మదర్ అండ్ చైల్డ్ హెల్త్) విభాగాన్ని కొనసాగించా లని వైద్యులు మోహన్, మల్లికార్జున్ కలెక్టర్ కు విన్నవించారు.

స్పందించిన కలెక్టర్ ముందుగా ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆదేశాల ను అమలు చేయాలని, మరమ్మ తు పనులకు  ప్రతిపాదనలు తయారుచేసి పం పించాలని సూచించారు. అయితే మెడికల్ కళాశాల పర్యవేక్షణలోనే ఆసుపత్రి నడుస్తోం దని, ఇంకా టెకెన్ ఓవర్ కాలేదనే విషయా న్ని వైద్యులు కలెక్టర్ దష్టికి తీసుకువచ్చారు.

అన్ని అంశాలతో ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని సందర్భంగా కలెక్టర్ వైద్యులను ఆదేశించారు. అంతకు ముందు ఉదయం  మండలంలోని అప్పక్ పల్లి వద్ద గల మెడికల్ కళాశాలను కలెక్టర్ పరిశీలించారు.