29-04-2025 12:00:00 AM
జైపూర్(చెన్నూర్), ఏప్రిల్ 28: జైపూర్ మండలం ఇందారం గ్రామ సమీప గోదావ రి నది బ్రిడ్జి వద్ద జిల్లా ప్రజల సౌకర్యార్థం మరొక నూతన ఇసుక రీచ్‌ను కలెక్టర్ కుమా ర్ దీపక్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
ప్రభు త్వం నిర్ణయించిన తక్కువ రేట్‌కు మన ఇసు క వాహనం ద్వారా ఇసుకను సరఫరా చేస్తా మని, సమీప గ్రామ పంచాయతీల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మైనింగ్ ఏడీ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంపీఓ బాపురావు, పంచాయితీ కార్యదర్శి సుమన్, ప్రజలు పాల్గొన్నారు.