జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,(విజయక్రాంతి): తెలంగాణ పారామెడికల్ బోర్డు పరిధిలోని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పారా మెడికల్ కోర్సులలో అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం తెలిపారు. కళాశాలలో పారా మెడికల్ కోర్సులైన డీఎంఎల్టీ 30 సీట్లు, డీఎంఎస్టీ 30 సీట్లు ఉన్నాయి. ఈ నెల 20వ తేదీలోగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇంటర్మీడియట్లో బైపీసీ పూర్తి చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఎంపీసీ, ఇతర గ్రూపులకు అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు.
ఈ నెల 20వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని, 25న ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని, డిసెంబర్ 2వ తేదీ నుండి తరగతులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులకు జనన ధృవీకరణ పత్రం (ఎస్ఎస్సీ, సమాన విలువ గల ధృవపత్రం), ఇంటర్మీడియట్, సమానమైన మార్క్స్ మెమో, ఉత్తీర్ణత పత్రము, బదిలీ ధృవపత్రం, 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు సంబంధిత కుల ధృవీకరణ పత్రం సమర్పించవలసి ఉంటుందని, ఆధార్కార్డు, దరకాస్తు ఫారంతో పాటు 100 రూపాయల నగదు జతపరిచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.