calender_icon.png 14 January, 2025 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారులను ఆశ్రయించి రైతులు మోసపోవద్దు

05-11-2024 08:27:40 PM

సంగారెడ్డి,(విజయక్రాంతి): రైతులు ఆరుగాలం శ్రమించి తాము పండించిన వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. మంగళవారం అందోల్ మండలం, డాకూర్, నాదులాపూర్ లలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ-ఐకెపి ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, నాదులాపూర్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ... సరైన తేమ శాతం ఉన్న ధాన్యాన్ని తూకం వేయాలని రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు.  రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని అన్నారు.