calender_icon.png 17 March, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఆర్ఎఫ్ కార్మికులు, యజమాన్యంతో చర్చలు

11-03-2025 08:16:22 PM

సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు సమక్షంలో చర్చలు.

ట్రైయిని  కార్మికులకు కాంట్రాక్టు కార్మికులుగా తీసుకోవడానికి అంగీకరించిన యాజమాన్యం

 గ్రాట్యూటీ చట్టం ప్రకారం గ్రాట్యూటీ డబ్బులు చెల్లించాలి

సంగారెడ్డి,(విజయక్రాంతి): సదాశివపేటలోని ఎంఆర్ఎఫ్ కంపెనిలో పనిచేస్తున్న ట్రైయిని కార్మికుల మధ్య తలెత్తిన వివాదంపై జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు జోక్యంతో జరిగిన చర్చలతో ఒక కొలిక్కి వచ్చాయి. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్  క్రాంతి  వల్లూరు కార్యాలయంలో ఎంఆర్ఎఫ్  ట్రైయిని  కార్మికులు, కంపెనీ యజమాన్యంతో  చర్చలు జరిపారు. ట్రైనీ కార్మికుల తమ ఇష్టా పూర్వకంగా కంపెనీలో పనిచేయదలుచుకుంటే వారిని కాంట్రాక్ట్ కార్మికులుగా తీసుకోవడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది.  సమాన పనికి సమాన వేతనం చట్టం ప్రకారం  ప్రకారం తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. వారి పనితీరు అర్హతలను బట్టి వారికి వేతనం రూపం 18 వేల నుండి రూ.24 వేల వరకు ఇవ్వడానికి కంపెనీ యజమాన్యం అంగీకరించింది.  కాంట్రాక్టు కార్మికులుగా 10 సంవత్సరాలకు పైగా పనిచేసిన ట్రైనీ కార్మికులకు గతంలో యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు గ్రాట్యూటీ చట్టం ప్రకారం గ్రాట్యూటీ డబ్బులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశాలు యాజమాన్యం జారి చేశారు. ఈ కార్యక్రమంలో  ఉప కార్మిక కమీషనర్ రవీంధర్ రెడ్డి , కార్మిక సంఘం ప్రతినిధులు ,తదితరులు పాల్గొన్నారు.