15-03-2025 11:34:53 PM
ఇండ్ల నిర్మాణం పనులు నాణ్యతతో జరిగేలా చూడాలి
చిట్కుల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు పరిశీలించిన కలెక్టర్
సంగారెడ్డి,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేసి నాణ్యతతో నిర్మాణం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారుల ఆదేశించారు. శనివారం పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశీలించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండ్లు నిర్మిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా శిక్షణ పొందిన మహిళా మేస్త్రీలు ఇండ్ల నిర్మాణంలో భాగస్వాములయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు తయారుచేసిన సిమెంట్ ఇటుకలను ఇండ్ల నిర్మాణంలో వినియోగించుకోవాలన్నారు. దీంతో తక్కువ ధరకు నాణ్యమైన ఇటుకలు లబ్ధిదారులకు లభిస్తాయన్నారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి ఇండ్ల నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు నిర్మాణం పనులను పరిశీలిస్తూ నిర్మాణం పనులు నాణ్యత జరిగేలా చూడాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ,పి డి చలపతి రావు, తహసీల్దార్ రంగారావు, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.