calender_icon.png 11 January, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సావిత్రిబాయి స్పూర్తితో విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు పాటుపడాలి

03-01-2025 04:14:52 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): సావిత్రిబాయి పూలే(Savitribai Phule) స్పూర్తితో విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు పాటుపడాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను తీర్చిదిద్దడంలో  చిత్తశుద్ధితో కృషి చేయాలని   జిల్లా కలెక్టర్  కోయ శ్రీహర్ష(Collector Koya Sriharsha) అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా  నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్  సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా  కలెక్టర్  మాట్లాడుతూ...  సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి మండలం నుంచి ఒక మహిళా ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని సత్కరించుకోవడం, చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.  

బాలికల విద్య కోసం సావిత్రిబాయి పూలే చాలా కృషి చేశారని, దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల విద్య కోసం  ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించారని, సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మనం ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేయాలని సూచించారు. విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ  కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. మాధవి, జీసీడీఓ కవిత, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త పిఎం షేక్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.