calender_icon.png 24 February, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో సర్వేయర్ల రికార్డుల నిర్వహణ పటిష్టంగా చేయాలి

24-02-2025 03:42:30 PM

సర్వేయర్లకు ల్యాప్‌టాప్‌లు పంపిణీలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో భూముల సర్వే సరిహద్దు రికార్డుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన కలెక్టర్ చాంబర్ లో జిల్లాలోని సర్వేయర్ల కు నూతనంగా 8 ల్యాప్ టాప్ లను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ... సర్వేయర్లు పని తీరు మెరుగు పర్చుకోవాలని, వారి నాణ్యమైన పనితీరుకు దోహదపడే విధంగా నూతనంగా అందించిన 8 ల్యాప్ టాప్ లను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ  కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్ శ్రీనివాసులు, సర్వేయర్లు అనిల్, సునీల్, నరేష్, శ్రీనివాస్ కృష్ణప్రియ ,రాధిక, రాజశేఖర్, చారి ,రఘుపతి , సాయి చరణ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.